GRAND SNAPANA TIRUMANJANAM AT SKVST_ వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజన శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు
Tirupati, 9 February 2018: As part of the ongoing Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram, celestial Snapana Thirumanjanam was performed on Friday morning after the Vahana Seva.
Chief Kankana bhattar Sri Balaji Rangacharyalu led the event which began with Vishwaksena Aradhana, Punaya havachana, Navalakashabisekam and Rajoparacham to the diety. Thereafter Chatra charama, darpana was offered with naivedyam, Mukha prakshanala, Dhupa naivedyam. Special offerings in milk, curd, coconut water, turmeric sandal paste.
The priests also chanted Tattariya Upanishad, Purusha suktam, Sri Suktam, Nilasuktam, Pancha Shanti mantra, Divya Prabandha etc. Seven varieties of garlands were also offered which included special herbs, Tulasi, sampangi, chamanti gulabi, and others.
Among others, Dy EO of TTD local temples Sri Venkatayya, AEO Sri Srinivasulu, and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజన శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు
తిరుపతి, 2018 ఫిబ్రవరి 09: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) నాల్గవ రోజైన శుక్రవారం శోభాయమానంగా
జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
ప్రధాన కంకణభట్టర్ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం),
వట్టివేరు, ఐదు రకాల పూలు రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.