SNAPANA TIRUMANJANAM HELD _ శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం
TIRUPATI, 16 FEBRUARY 2023: Snapana Tirumanjanam, the special abhishekam was held to Sri Somaskanda and Kamakshi Devi in Sri Kapileswara Swamy temple on Thursday.
Everyday, between 10:30am and 11:30am this holy event is being observed till the completion of annual fete.
Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradi, Superintendent Sri Bhupati Raju and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం
తిరుపతి, 16 ఫిబ్రవరి 2023: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) వేడుకగా జరుగుతోంది. కంకణభట్టార్ శ్రీ ఉదయాస్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం), పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.