SOMA SKANDA ATOP GAJA VAHANAM CHARMS DEVOTEES _ గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి రాజసం
Tirupati, 19 Feb. 20: Sri Soma Skanda Murthy took out a celestial ride on Wednesday evening as a part of the ongoing annual brahmotsavams at Sri Kapileswara Swamy temple.
On the sixth day evening, an interesting coincidence took place, once again proving that “Siva Kesava Abedha”, as both the deities of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram and Sri Somaskanda Murthy at Sri Kapileswara Swamy brahmotsavams blessed devotees on Gaja Vahanams.
The devotees thronged along the streets to render Harati to the who was seated majestically on Gaja Vahanam.
DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati Raju and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి రాజసం
తిరుపతి, 2020 ఫిబ్రవరి 19: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
ఆద్యంతరహితుడైన శివదేవున్ని ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలమని పండితుల మాట.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ కె.ఈశ్వరయ్య బృందం మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సరోజిని బృందం శివస్తోత్రం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు నర్సాపురానికి చెందిన శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ శర్మ ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాల హరికథ విభాగాధిపతి శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరుపతికి చెందిన జి.మధుసూదనరావు బృందం అన్నమయ్య విన్నపాలు సంకీర్తనాలాపన, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ రాధికా వేంకటరమణ బృందం భక్తి సంగీతం వినిపించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు విశాఖకు చెందిన డా. ద్వారం వికెజి.త్యాగరాజ్ బృందం ఊంజల్‌సేవలో భక్తి సంకీర్తనలు ఆలపించారు.
అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఖమ్మంకు చెందిన శ్రీ మీనా నృత్యాలయ బృందం నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.