SOMA SKANDAMURTHY RIDES TIRUCHI VAHANAM _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి

TIRUPATI, 02 MARCH 2022: The Somaskanda Murty was seated majestically on Tiruchi vahanam on Wednesday evening in Ekantam due to Covid restrictions.

Earlier in the evening, Siva Parvati Kalyanam took place between 5pm and 7pm.

Board members Sri Pokala Ashok Kumar, temple Deputy EO Sro Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, temple inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2022 మార్చి 02: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన బుధ‌వారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న‌సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
అంతకుముందు సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

వాహ‌న‌సేవ‌లో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ స‌త్రే నాయ‌క్, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.