SIVARATRI SANGEETA, NRITYA MAHOTSAVAM CONCLUDED LEAVING DENIZENS MESMERIZED _ ఘనంగా ముగిసిన శివరాత్రి సంగీత, నృత్య మహోత్సవం

TIRUPATI, 02 MARCH 2022: The three day Maha Sivaratri Sangeeta, Nritya Mahotsavams concluded on a grand note leaving art lovers of Tirupati spell bound in the devotional musical and dance fiesta.

Apart from the vocal, instrumental, Bharatnatyam, Kuchipudi, the Harikatha presented by renowned Harikatha Parayanamdar Sri Y Venkateswarulu on Siva Parvati Kalyanam on Wednesday evening entertained everyone. The background score given by Sri Murali on Keyboard, Rhythm by Sri Jayachandra, Tabala by Deva Sharma provided the realistic feel to the audience.

Devastanams Education Officer (DEO) Sri C Govindarajan, Principal of SV College of Music and Dance Sri Tirupati M Sudhakar, former retired Principal Dr YVS Padmavathi were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శివరాత్రి సంగీత, నృత్య మహోత్సవం

తిరుపతి, 2022 మార్చి 02: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన సంగీత, నృత్య మహోత్సవాలు తిరుపతి మహతి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి.

గాత్రం, వాయిద్యం, భరతనాట్యం, కూచిపూడితో పాటు బుధవారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం సందర్భంగా ప్రముఖ హరికథా పారాయణదారు శ్రీ వై. వెంకటేశ్వరుల హరికథ అందరినీ అలరించింది. కీబోర్డ్‌లో శ్రీ మురళి అందించిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం, శ్రీ జయచంద్ర రిథమ్, దేవశర్మ అందించిన తబలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

టీటీడీ విద్యాశాఖ అధికారి శ్రీ సి.గోవిందరాజన్, ఎస్. వి.సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.