SOMASKANDA BLESSED ON VYAGHRA VAHANAM _ వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
Tirupati, 27 Feb. 22: On the sixth day morning of the ongoing annual Brahmotsavam in Sri Kapileswara Swamy temple at Tirupati, the Somaskanda Murty appeared on Vyaghra vahanam to bless His devotees in Ekantam.
Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 2022 ఫిబ్రవరి 27: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహన సేవలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ సత్రే నాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.