SOME EXCERPTS IN DIAL YOUR EO_ జూలై 12 నుంచి తిరుమలలో గదులు పొందేందుకు నూతనంగా నమోదు విధానం

Tirumala, 7 July 2017: The monthly “Dial Your EO” program was held at Annamaiah Bhavan in Tirumala on Friday. TTD EO Sri Anil Kumar Singhal attended to 29 calls of various pilgrim callers. Before taking calls EO briefed about the various important upcoming religious events in Tirumala and some major developmental activities taken by the temple management following the feedback from pilgrims. Some excerpts:

• The annual Srivari Brahmotsavams will be observed from September 23 to October 1 and all the arrangements for the mega religious fete will be completed before September 15.

• For the month of October 56,295 Srivari Arjitha Seva online quota tickets have been released today at 10am on our website.

• The premiere sevas includes 12,495 out of which 7780-Suprabhatam, 120 each Thomala and Archana, 1875 Visesha Puja, 300 Astadala Pada Padmaradhana and 2300 Nija Pada Darshanam will be released.

• The devotees can register for these seva tickets for a week. Those who receive the arjitha seva should make the payment within three days failing which for such tickets the online dip will be conducted again and they will also be given three days’ time for payment.

• This month the second online dip will be conducted on July 17 by 12 noon and the second dip for the tickets which were left over in the month of September will also be taken

• The ordinary arjitha seva tickets remaining in the online quota is 43,800. This includes 10,500 Kalyanotsavam, 2,800 Unjal Seva, 11,180 Vasanthotsavam, 6,020 Arjitha Brahmotsavam and 13,300 Sahasradeepalankara Seva tickets.

• TTD has also introduced some incentives to the pilgrims for online advance bookings of accommodation from June 15 onwards. The pilgrims are being refunded 50% if they vacate the rooms before 12 hours and 25% if they vacate the rooms between 12 and 18 hours. The amount will be credited back to their original source of payments within seven working days.

• Till July 5, so far 773 devotees received 50% reimbursement and 1,419 were reimbursed 25%. For a total of 2,226 devotees, an amount of Rs.1,32,897 has been reimbursed so far.

• From July 3 onwards, if the pilgrims cancel their online booking of accommodation two days before, they are being given 100% reimbursement.

• The amendments in the queue line system brought near Vendi Vakili recently is also yielding fruitful results avoiding jostling among pilgrims.

• Theertham is now distributed to pilgrims in two lines

• Help Desks are being run with Srivari Seva volunteers in VQC I and II compartments which is also giving feedback from pilgrims. The free phone facility arranged in the compartments for the sake of pilgrims to inform their movement to their kin and kith

• From June 30 onwards, akin to Sarva Darshanam pilgrims, the access cards are also being issued to Divya Darshanam pilgrims

• This year unprecedented pilgrim crowd has been witnessed in Tirumala and the total pilgrims who had darshan in the month of June is 25.77 lakhs

• Over one crore laddus were distributed to pilgrims in both May and June

• Following the requests from physically challenged and aged pilgrims, on July 18 and 25, total 4000 darshan tokens will be issued in three slots including 1000 tokens at 10am, 1000 tokens at 2pm and another 1000 at 3pm.

• Similarly considering the requests of parents with infants, on July 19 and 26 parents with children below 5years of age will be allowed through supadham from 9am to 1:30pm. Henceforth for couple of days during every month this provision will be given to this category of pilgrims.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, SO Sri N Muktheswara Rao, CE Sri Chandrasekhar Reddy and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 12 నుంచి తిరుమలలో గదులు పొందేందుకు నూతనంగా నమోదు విధానం :
ఆన్‌లైన్‌లో 56,295 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూలై 07, తిరుమల, 2017 : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు గదులు పొందేందుకు జూలై 12వ తేది నుంచి నమోదు చేసుకునే విధానాన్ని నూతనంగా వ్రవేశపెడుతున్నట్లు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు చేసిన సూచన మేరకు తిరుమలలో గదులు పొందేందుకు సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇందుకోసం కేంద్రీయ విచారణ కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కౌంటర్లలో ముందుగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న గదులను మొదట నమోదు చేసుకున్నవారికి మొదటనే అనే ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. గదుల కేటాయింపు సమాచారాన్ని సంబంధిత భక్తులకు ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఈ విధానంలో భక్తులు ఎక్కువసేపు క్యూలైన్‌లో వేచిఉండాల్సిన అవసరం లేదన్నారు.

ఆన్‌లైన్‌లో 56,295 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

అక్టోబర్‌ నెలకు సంబంధించి 56,295 సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు ఈవో వెల్లడించారు. ఇందులో ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో సుప్రభాతం 7,780, తోమాల 120, అర్చన 120, విశేష పూజ 1,875, అష్టదళపాద పద్మారాధన 300, నిజపాద దర్శనం 2,300 టికెట్లు కలిపి మొత్తం 12,495 సేవా టికెట్లు ఉన్నాయన్నారు. భక్తులు ఆర్జితసేవల కోసం వారం రోజుల పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు 3 రోజులలో పేమెంట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. సొమ్ము చెల్లించనిచో సదరు టికెట్లను మరోసారి ఆన్‌లైన్‌ డిప్‌ తీసి ఇతర భక్తులకు కేటాయిస్తామని తెలియజేశారు. వారికి కూడా పేమెంట్‌ చేసేందుకు 3 రోజులు గడువు ఇస్తామన్నారు. జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత డిప్‌తోపాటుగా, సెప్టెంబర్‌ నెలలో మిగిలిన టికెట్లను కూడా రెండవ సారి డిప్‌ తీస్తామని వివరించారు. అదేవిధంగా, ఆన్‌లైన్‌ సాధారణ ఆర్జిత సేవా టికెట్లు 43,800 ఉన్నాయి. వీటిలో కల్యాణోత్సవం 10,500, ఊంజల్‌ సేవ 2,800, ఆర్జితబ్రహ్మూెత్సవం 6,020, వసంతోత్సవం 11,180, సహస్రదీపాలంకార సేవ 13,300 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. వరంగల్‌కు చెందిన సత్యనారాయణ, ప్రకాశంకు చెందిన నరసింహారావు అడిగిన ప్రశ్నలకు ఈవో పైవిధంగా సమాధానం ఇచ్చారు.

1. యాదగిరి – సికింద్రాబాద్‌, సూర్యప్రకాష్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: హిమయత్‌నగర్‌లోని టిటిడి ఈ దర్శన్‌ కేంద్రంలో రూ.50 దర్శన టోకన్లు ఇవ్వడం లేదు ?

ఈ.వో. ఈ దర్శన్‌ కౌంటర్లలో రూ.50 దర్శన టికెట్లను నిలిపివేయడమైనది.

2. శ్రీనివాసరావు – శ్రీకాకుళం

ప్రశ్న: శ్రీనివాసకల్యాణం జరిపించేందుకు దరఖాస్తు చేశాం ?

ఈవో. శ్రీనివాసకల్యాణాలను ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన రూట్లలో నిర్వహిస్తున్నాం.

3. దినేష్‌ – చెన్నె

ప్రశ్న: చెన్నై నుంచి నడిచి వస్తున్నాం గదులు కేటాయించండి ?

ఈవో. నడచివచ్చే భక్తులకు గదుల కేటాయింపులో ప్రత్యేక కోటా లేదు.

4. శ్రీనివాసరావు – హైదరాబాద్‌.

ప్రశ్న: లడ్డూల కోసం గుడ్డ సంచులను వాడండి ?

ఈవో. సూచన బాగుంది. పరిశీలిస్తాం.

5. కుమార్‌ – మెదక్‌

ప్రశ్న: అఖండనామ సంకీర్తనకు అవకాశం ఇవ్వండి ?

ఈవో. ఫోన్‌లో వివరాలు తెలియజేస్తాం.

6. లక్ష్మీనారాయణ – సికింద్రాబాద్‌

ప్రశ్న: శ్రీవారి ఆలయం వెలుపల మరొక హుండీని ఏర్పాటు చేయండి ?

ఈవో. అఖిలాండం దగ్గర హుండీ ఉంది.

7. గీతా ప్రకాష్‌ – హుబ్లీ

ప్రశ్న: రైల్వేలో పనిచేస్తున్నాను. ఆన్‌డ్యూటీలో శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పించండి ?

ఈవో. మీ సంస్థను సంప్రదించి అనుమతి పొందండి.

8. రమేష్‌ – పశ్చిమగోదావరి, మురళీకృష్ణ – హైదరాబాద్‌, సోమేశ్వరి – విశాఖ

ప్రశ్న: ఎస్వీబీసీ వాణిజ్య ప్రకటనలు తగ్గించండి, రామానుజ వైభవంపై పరిశోధక పండితులతో ఉపన్యాసాలు చేయించండి, తిరుమల క్షేత్రం, తిరుపతిలోని ఇతర దర్శనీయ ప్రాంతాల గురించి ప్రసారం చేయండి. పర్వదినాల సమయంలో వాటి విశేషాలను తెలియజేయండి ?

ఈవో. వాణిజ్య ప్రకటనలను చాలా తక్కువగా ప్రసారం చేస్తున్నాం. నిపుణులైన పండితులతో రామానుజవైభవంపై ప్రసారాలు చేస్తాం. రెండు నెలలలో నూతన కార్యక్రమాలు ప్రసారం చేస్తాం.

9. హరిప్రసాద్‌ – చెన్నె, సత్యభాస్కర్‌ – విజయవాడ.

ప్రశ్న: దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ధోతి ధరించేందుకు ఇబ్బందిగా ఉంది ?

ఈవో. కుర్తా, పైజామా కూడా ధరించవచ్చు.

10. నవీన్‌ కుమార్‌ – చిత్తూరు

ప్రశ్న: శ్రీవారి నామాల తరహాలో తిరుమల అనే అక్షరాలు కనిపించేలా ఏర్పాటు చేయండి?

ఈవో. భక్తులు కోరితే ఏర్పాటు చేస్తాం.

11. రాజశేఖర్‌ – తిరుపతి

ప్రశ్న: గతంలో ఏఏడి పేరిట ఉన్న దర్శన టికెట్లను ప్రస్తుతం విఐపిలకే పరిమితం చేశారు?

ఈవో. ఏఏడి స్థానంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విధానాన్ని అమలు చేస్తున్నాం.

12. భాస్కర్‌ – కరీంనగర్‌

ప్రశ్న: బ్రహ్మూెత్సవాల సమయంలో రూ.300 టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో లేవు?

ఈవో. ఎక్కువ మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో బ్రహ్మూెత్సవాల సమయంలో రూ.300 టికెట్లు ఇవ్వడం లేదు.

13. హనుమంతరావు – హైదరాబాద్‌

ప్రశ్న: ఆన్‌లైన్‌లో సేవా టికెట్‌ రద్దు చేసుకుంటే ఆ తర్వాత 6 నెలల వరకు అవకాశం ఉండటం లేదు.?

ఈవో. భక్తుల అభిప్రాయాలను కూడా సేకరించి నిర్ణయం తీసుకుంటాం.

14. శివకుమార్‌ – నెల్లూరు

ప్రశ్న: టిటిడి భక్తులకు మంచి సేవలందిస్తోంది. సిబ్బంది, అధికారులకు కృతజ్ఞతలు?

ఈవో. ధన్యవాదాలు.

15. శ్రీమన్నారాయణ- వరంగల్‌

ప్రశ్న: తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఆహారం నాణ్యంగా లేదు ?

ఈవో. నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటాం.

16.శ్రీనాథ్‌ – వైజాగ్‌, ఆనంద్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: వెండివాకిలి, మహాద్వారం వద్ద తోపులాటను నివారించండి ?

ఈవో. ఇటీవల వెండివాకిలి వద్ద క్యూలైన్లో మార్పులు చేశాం.

17.శ్రీనివాస్‌ – గిద్దలూరు

ప్రశ్న: వయోవృద్ధుల క్యూలైన్లో ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నాం. ?

ఈవో. వృద్ధులు, దివ్యాంగులు టోకెన్లలో సూచించిన సమయానికి దర్శనానికి రావచ్చు. క్యూలో వేచియుండాల్సిన అవసరం లేదు.

18. గోపినాథ్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: అభిషేకం టికెట్లు ఎలా పొందాలో తెలపండి ?

ఈవో. తిరుమలలో లక్కీడిప్‌ విధానంలో అభిషేకం టికెట్లు కేటాయిస్తున్నాం.

19. రామకృష్ణ – వైజాగ్‌

ప్రశ్న: కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచియుండే సమయంలో భజనలు ఏర్పాటు చేయండి ?

ఈవో. తప్పకుండా ఏర్పాటు చేస్తాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఎ. రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌. ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీరవీంద్రారెడ్డి, శ్రీమతి విమలకుమారి, అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, బోర్డుసెల్‌ డిప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జీఎల్‌ఎన్‌ శాస్త్రీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.