SPCHC BOON TO MANY CHILDREN-TTD CHAIRMAN _ పేద పిల్లల ప్రాణాలు కాపాడటానికి రూ 250 కోట్లతో శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం

TIRUPATI, 15 FEBRUARY 2023: Sri Padmavathi Children’s Heart Centre(SPCHC), built at a cost of Rs.25cr which was inaugurated on 11 October in 2021 by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy in Tirupati is proving to be a boon to many children who are suffering from heart ailments, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

 

The TTD Trust Board Chief during the press meet held at the hospital premises on Wednesday said that the hospital is presently equipped with 75 beds including ICU Beds, 3 modular Operation Theatres and with advanced Cath Lab.

 

Till date since its inception, around 1105 Surgeries have been completed in 15 months’ span to months old infants to teens providing them a new lease of life with a 95% success rate. The first ever Heart Transplant Surgery was also successfully performed on 20 January this year successfully with a team of doctors lead by Dr. N.Srinath Reddy (Senior Paediatric Cardiologist). Dr.K.Ganapathy Subramaniam (Senior Paediatric C.T. Surgeon), Dr.A.Madhu Yadav, (Paediatric Intensive Anesthetist), Dr Abhinav, Dr Rambabu (Jeevandaan) were among others to carry out this first Paediatric Heart Transplant in Andhra Pradesh, he maintained.

 

He also said, the proposed Sri Padmavathi Paediatric Super Specialty Hospital with area of 4.1 lakh Sq.ft and 350 beds, Air lift Ambulance Services facility and with 14 Paediatric Super Specialties with dedicated multi Organ transplant units viz.,

• Genetics

• Gastroenterology

• Urology & Uro-surgery

• Neurology & Neuro-surgery

• Nephrology

• Endocrinology

• Pulmonology

• Cardiology & Cardio Thoracic Surgery

• Haematology

• Medical Oncology and Surgical Oncology

• Multi Organ Transplant Unit.

 

are also coming up soon, he maintained. He said the hospital will render more and more surgeries to the needy with the benign blessings of Sri Venkateswara Swamy.

Earlier the Chairman also interacted with the mother of the boy who under went successful Heart Transplantation who expressed immense pleasure and thanked TTD for giving her child a new life.

 

JEO for Health and Education Smt Sada Bhargavi also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పేద పిల్లల ప్రాణాలు కాపాడటానికి రూ 250 కోట్లతో శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం

– ఈ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి సకల సదుపాయాలతో పాటు ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం

– రాష్ట్రంలో తొలి చిన్న పిల్లల గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న విశ్వేశ్వర్ ను పరామర్శించిన టీటీడీ చైర్మన్

– వైద్యుల కృషిని అభినందించిన శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 15 ఫిబ్రవరి 2023: రాష్ట్రంలో పేద పిల్లల ప్రాణాలు కాపాడటానికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రూ 250 కోట్లతో నిర్మిస్తున్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకుని వస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి అవసరమైన అన్ని సదుపాయాలతోపాటు హెలిపాడ్ కూడా నిర్మిస్తామని తెలిపారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి )లో జనవరి 20వ తేదీ రాష్ట్రంలోనే తొలి చిన్న పిల్లల గుండె మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కెఎస్ ఆర్ అగ్రహారం కు చెందిన 15 సంవత్సరాల విశ్వేశ్వర్ కు వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. బుధవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి జేఈవో శ్రీమతి సదా భార్గవితో కలసి ఆసుపత్రిలో విశ్వేశ్వర్ తో పాటు అతని తల్లి శ్రీమతి రాధమ్మనుపరామర్శించారు. గుండె మార్పిడి ఆపరేషన్ లో పాల్గొన్న వైద్య బృందంతో ఈ ఆపరేషన్ జరిగిన విధానం పై మాట్లాడారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఆసుపత్రి లేని లోటు తీర్చాలని ముఖ్యమంత్రి
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

2021 అక్టోబర్‌ 11వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభించామని తెలిపారు.

75 పడకలు గల ఈ ఆసుపత్రిలో ఐసియు పడకలు, 3 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, అధునాతన క్యాథ్‌ ల్యాబ్‌ ఉన్నాయన్నారు. డా.వై.ఎస్‌.ఆర్‌.ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకాల కింద కేవలం 15 నెలల కాలంలోనే 1110 మంది చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. విశ్వేశ్వర్ కు గుండె పూర్తిగా దెబ్బతిన్నందువల్ల గుండె మార్పిడి చేయాల్సి ఉందని చిన్నపిల్లల గుండె ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారన్నారు. విశాఖపట్నంలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను దానం చేయడానికి కుటుంబసభ్యులు సిద్ధంగా ఉన్నారని జీవన్ దాన్ ద్వారా తెలుసుకుని వారితో సంప్రదించారన్నారు. అబ్బాయి ప్రాణాలు కాపాడాలనే పట్టుదలతో వైద్యులు తిరుపతి నుండి కారులో విశాఖ వెళ్ళి అక్కడ గుండె తీసుకుని విమానంలో నాలుగు గంటల్లోగా ఆసుపత్రికి తీసుకుని వచ్చి విశ్వేశ్వర్ కు అమర్చారని తెలిపారు. చిన్నపిల్లల గుండె ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్‌ ఎన్‌.శ్రీనాథ్‌ రెడ్డి (సీనియర్‌ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌) ఆధ్వర్యంలో డాక్టర్‌ కె.గణపతి సుబ్రమణ్యం (సీనియర్‌ పీడియాట్రిక్‌ సి.టి. సర్జన్‌), డాక్టర్‌ ఎ.మధు యాదవ్‌ (పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ అనస్థీటిస్ట్‌) , జీవన్ దాన్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ రాంబాబు బృందం తో పాటు చాలా మంది వైద్య నిపుణులు,సిబ్బంది శ్రమించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశారని చైర్మన్ అభినందించారు.

ఇందుకోసం విశాఖ పట్నం,తిరుపతి జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఎయిర్‌పోర్టు నుండి ఆసుపత్రి వరకు ప్రత్యేక గ్రీన్‌కారిడార్‌ ఏర్పాటుచేసి నిర్దేశిత వ్యవధిలో గుండెను తీసుకొచ్చేలా కృషి చేసిన వారందరినీ అభినందించారు. మరో నాలుగైదు రోజుల్లో విశ్వేశ్వర్ ను డిశ్చార్జ్ చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి , చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ భరత్ తో పాటు ఆసుపత్రి వైద్యులు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది