SPECIAL CULTURAL PROGRAMS ATTRACT ART LOVERS_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 15 November 2017: The devotional programs organised by HDPP, Annamacharya wings of TTD in connection with Ammavari Brahmotsavams have been attracting art lovers in Tirupati and Tiruchanoor in a big way.

The temple management has arranged both devotional music and dance programs at Asthanamandapam in Tiruchanoor, Mahati Auditorium, Urban Haat etc. with best artistes.

On Wednesday evening the Annamacharya Sankeertana Pada Vinnapalu, a series of songs rendered jointly by Sri P Munirathnam Reddy, the Tiruchanoor temple chief officer and Sri Balasubramanyam of Electrical wing in Asthanamandapam had mesmerised the devotees.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2017 నవంబరు 15: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింప చేశాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానురులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ కె.ఎస్‌.రామానుజం గారిచే ధార్మికోపన్యాసం, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీ జి.చంద్రశేఖర్‌రావు భక్తి సంగీత కార్యక్రమాలు జరిగింది.

అనంతరం కోలార్‌కు చెందిన శ్రీమతి ఎస్‌.మంజుల బృందంచే మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు హరికథ, సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే అన్నమయ్య విన్నపాలు, ఊంజల్‌ సేవలో సంకీర్తనాలాపన నిర్వహించారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఉడిపికి చెందిన సిద్ధి వినాయక యక్షగాన కళాకేంద్రం వారిచే యక్షగాన కార్యక్రమం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ పావని కాశీనాథ్‌ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ నృత్యపిళ్ళై బృందం నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరునల్వేలికి చెందిన శ్రీచిత్ర గోపినాథ్‌ బృందంచే నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.