AP MINISTER OFFERS SILK VATRAMS TO GODDESS PADMAVATHI_ శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

Tiruchanur, 15 November 2017: On behalf of Government of Andhra Pradesh, Honourable Minister for Industries Sri Amarnath Reddy offered PATTU Vastrams to Goddess Padmavathi Devi at Tiruchanoor on first day of Brahmotsavams on Wednesday evening.

He was accorded warm welcome by Tirupati JEO Sri Pola Bhaskar along with temple Spl.Gr.DyEO Sri Munirathnam Reddy. Even as the minister carried the vastrams over his head, the Vedic pundits chanted Veda mantras and given a traditional welcome to the dignitary.

Later the minister had darshan of Goddess Padmavathi Devi. The temple officials presented him with the prasadams of Goddess.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

నవంబరు 15, తిరుపతి, 2017: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాల్లో మొదటిరోజైన బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు గౌ|| శ్రీఎన్‌.అమరనాథరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం గౌ|| మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన గౌ|| ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్రానికి, జిల్లాకు పరిశ్రమలు రావడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తుడ ఛైర్మన్‌ శ్రీ నరసింహయాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రెడ్డివారి ప్రీతమ్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.