SPECIAL DARSHAN FOR SENIOR CITIZEN AND DISABLE PILGRIMS ON FEB 11 _ ఫిబ్రవరి 11న వృద్ధులు, దివ్యాంగులకు, 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
Tirumala, 8 Feb. 20: Special darshan for senior citizens, challenged persons is on February 11 and 25, while that of parents with children below five years is on February 12 and 26 this month.
As a part of this, on February 11 and 25 for senior citizens (above 65 years) and challenged persons, TTD is giving 4000 tokens (1000 tokens at 10am, 2000 tokens at 2pm slot and 1000 tokens during 3pm slot on these two days.
Similarly TTD will provide darshan for parents with children of below five years from 9.30 am to 1.30 pm on February 12 and 26, through Supatham entry.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 11న వృద్ధులు, దివ్యాంగులకు, 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
ఫిబ్రవరి 08, తిరుమల 2020: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 11న మంగళవారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
అదేవిధంగా, ఫిబ్రవరి 12న బుధవారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.