SPECIAL EVENTS AT SRI KODANDARAMASWAMY TEMPLE IN THE MONTH OF JULY 2019_ జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 26 Jun. 19: Special events in Sri Kodanda Rama Swamy temple in Tirupati in the month of July.

July 2: Sahasra Kalasabhishekam on the occasion of Amavasya and Hanumantha Vahana Seva in the evening.

July 4: Sita Rama Kalyanam on the auspicious occasion of the advent of Punarvasu, the birth star of Lord Rama

On all Saturdays 6,13,20,27: Abhisekam of Sri Seetharama mula idols -Tiruchi procession of Swamy and Ammavaru on temple mada streets- unjal Seva-Devotees can participate in Abhisekam @ Rs.20 tickets. Devotees can also participate in Unjal Seva by paying Rs.116/-

July 16: Astothara Shatakalashabisekam on the occasion of Pournami -Rs.50 ticket for participation. Golden Tiruchi procession – Unjal Seva and Asthanam at Sri Ramachandra Pushkarini.

July 28 to 30: Annual Pavitrotsavams

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2019 జూన్ 26: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 2న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– జూలై 4న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద‌కు ఊరేగింపుగా తీసుకెళ‌తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఊంజ‌ల్‌సేవ నిర్వ‌హిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు.

– జూలై 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్ కొనుగోలు చేసి ఊంజ‌ల్‌సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు.

– జూలై 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఆస్థానం చేప‌డ‌తారు.

– జూలై 28 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామాల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.