SPECIAL EVENTS IN SRI GOVINDARAJA SWAMY TEMPLE IN JUNE 2018 _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాలలో జూన్‌ నెలలో విశేష ఉత్సవాలు

Tirupati, 02 June, 2018: Here is the schedule of events which will be performed in the temple of Sri Govindaraja Swamy during June 2018 .

· June 3- Vasantotsavam,

· June4 -Khanijatota Utsavam and procession of Lord Venkateswara in view of Sravana nakshatram,

· June 8,15,22,29 Fridays Sri Andal Amma procession on mada streets,

· June 13 -Rohini Nakshatram- Procession of Lord Parthasarathy swami,

· June 20 – Ankurarpanam for Pushpa yagam ,

· June 21 – Pushpa yagam,

· June 23 – Swati Nakshatram -Sri Periyalwar Utsavam and procession on Gajavahanam,

· June 28- Pournami Garuda Seva.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాలలో జూన్‌ నెలలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 02 జూన్‌ 2018 ; టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూన్‌ 3న వసంతోత్సవం సందర్భంగా సాయంత్రం 5.00 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిస్తారు.

– జూన్‌ 4న ఖనిజతోట ఉత్సవంను పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఉదయం 9.30 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి పాతహూజూరు ఆఫీసులోని నడబావి వద్దకు చేరుకుంటారు. అక్కడ స్వామివారికి స్నపన తిరుమంజనం, ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

– జూన్‌ 4న శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

– జూన్‌ 8, 15, 22, 29వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

– జూన్‌ 13న రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని సాయంత్రం 5.30 గంటలకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తారు.

– జూన్‌ 20న పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సేనాధిపతివారి ఉత్సవం నిర్వహిస్తారు.

– జూన్‌ 21న పుష్పయాగం జరుగనుంది. ఉత్తరా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.

– జూన్‌ 23న స్వాతి నక్షత్రం, శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు గరుడవాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌వారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

– జూన్‌ 28న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగనుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.