PUSHPA YAGAM AT SRI VEDANARAYANA SWAMY TEMPLE NAGALAPURAM ON 04thJUNE _ జూన్‌ 4న నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో పుష్పయాగం

Nagulapuram ,02June,2018 : The unique ritual of Pushpa yagam will commence from June 04th at Sri Vedanarayanaswami Temple,Nagulapuram for which Ankurarpanam will be performed on Sunday evening,June 03.

Temple priests will perform snapana tirumanjanam on Monday afternoon before commencing Pushpa yagam in the evening.

Later in the evening Sri Vedanarayana swami along with his consorts will be paraded on the mada streets .Pushpa yagam is a ritual toward off any ill effect of lapses conducted in the temple during the recently performed Brahmotsavam from April 29th to May 7th.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 4న నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి, 02 జూన్‌ 2018 ; టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో జూన్‌ 4వ తేదీన పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం జూన్‌ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణం నిర్వహిస్తారు.

పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు.

అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ వేదనారాయణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 29 నుండి మే 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.