SPECIAL FESTIVALS AT SRI KODANDARAMA SWAMY TEMPLE IN SEPTEMBER _ సెప్టెంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, August 31, 2025: Several special festivals are scheduled to be held in the month of September at Sri Kodandarama Swamy Temple, Tirupati. The details are as follows:
September 6, 13, 20 & 27 (Saturdays):
Abhishekam to the presiding deities of Sri Sita, Rama and Lakshmana at 6 AM.
September 7 (Pournami – Full Moon Day):
Ashtottara Shata Kalasa Abhishekam at 9.30 AM.
September 7 (Lunar Eclipse):
The temple remains closed from 3PM onwards.
September 17 (Punarvasu Nakshatram):
Sri Sitarama Kalyanam at 11AM.
At 5.30 PM, the deities will be taken in a procession around the four Mada Streets up to Sri Ramachandra Pushkarini.
At 6.30 PM, Unjal Seva will be observed.
September 21 (Amavasya – New Moon Day):
Sahasra Kalasa Abhishekam at 9AM.
Hanumanta Vahana Seva at 7 PM.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 ఆగష్టు 31: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
– సెప్టెంబరు 7న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
– సెప్టెంబరు 7న చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం మూత.
– సెప్టెంబరు 17న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
– సెప్టెంబరు 21న అమావాస్య సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
