SPECIAL INVITEES SWORN IN_ టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి ప్ర‌త్యేక ఆహ్వానితుల ప్రమాణస్వీకారం

Tirumala, 23 Sep. 19: The special invitees appointed by the state government in TTD board, took oath on Monday evening in Srivari temple.

Out of seven, six took oath in the sanctum sanctorum including Sri B Karunakar Reddy, local legislator, Rakesh Sinha, AJ Sekhar, Kupender Reddy, Dushmanta Kumar Das and Amol Kale. The oath was administered by Sri A V Dharma Reddy, Special Officer of Tirumala.

Later the special invitees were rendered Vedasirvachanam by Vedic pundits and offered Theertha prasadams and a laminated photo of Lord Venkateswara by Special Officer.

Speaking on this occasion, Sri Karunakar Reddy thanked Lord Sri Venkateswara Swamy for giving an opportunity to all the special invitees to render services to their best possible abilities.

“We will definitely stand to the expectations of the Honourable CM of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy, in safeguarding the interests of millions of pilgrims thronging Tirumala temple. Our priority is to provide them all amenities and hassle-free darshan besides taking up Hindu Sanatana Dharma publicity activity in a widespread manner”, Sri Reddy maintained.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి ప్ర‌త్యేక ఆహ్వానితుల ప్రమాణస్వీకారం

తిరుమల, 2019 సెప్టెంబ‌రు 23: నూత‌న టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 7 మంది ప్ర‌త్యేక ఆహ్వానితుల‌లో ఆరుగురు సభ్యులు తిరుమల శ్రీ‌వారి ఆలయంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు.

ఇందులో భాగంగా తిరుప‌తి శాస‌న స‌భ్యులు శ్రీ బి.క‌రుణ‌క‌ర్‌రెడ్డి, శ్రీ రాకేష్ సిన్హా, శ్రీ ఎ.జె.శేఖ‌ర్‌, శ్రీ కుపేందర్ రెడ్డి, శ్రీ దుష్మంత కుమార్ దాస్, శ్రీ అమోల్ కాలే టిటిడి ట్రస్ట్ బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం ప్ర‌త్యేకాధికారి శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్రాప‌టాన్ని అందించారు.

అనంత‌రం ఆల‌యం వెలుప‌ల శ్రీ బి.క‌రుణ‌క‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో శ్రీవారు స్వ‌యంభూగా వెలిశార‌న్నారు. స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మాన్ని విశ్వ‌వ్యాప్తం చేయ‌డానికి చిత్త శుద్ధి క‌లిగిన కార్య‌క‌ర్త‌లాగా ప‌నిచేస్తామ‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు గౌ.శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టుగా శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లందిస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.