TTD CHAIRMAN EXHORTS NEW BOARD MEMBERS TO SERVE DEVOTEES_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 23 Sep. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy exhorted the new members of Trust board to strive for the welfare of the devotees who throng Tirumala from all corners of the country as well as the world for just a few seconds of darshan of Lord Venkateswara.

He was addressing the first meeting of the 50th Trust Board in the 86 year old journey of TTD, held at Annamaiah Bhavan in Tirumala on Monday.

He asked all members to fulfill their commitments to Lord Venkateswara by serving the people with the co-ordination of TTD officials and employees in the opportunity provided by the esteemed AP Chief Minister Sri YS Jaganmohan Reddy.

Addressing the media after the board meeting the Chairman said that the Board in its maiden meeting has cleared pending issues before the board for the smooth running of TTD administration.

He said the Board has resolved to build Balaji reservoir in Tirumala to provide a permanent solution to the drinking water needs of the hill shrine and estimates for the same would be placed before the next meeting of the board.

The Sri Venkateswara temple project at Amaravati has been reduced from Rs.150crores to Rs.36 crores with necessary amendments in the design.

The Avilala project also re-engineered as a park and tank for benefit of the citizens of Tirupati. Similarly the budget for the Garuda Varadhi project to be revised in consultations with the AP government.

Another important aspect of the introduction of Electric battery vehicles in Tirumala to protect the environment has also been discussed in the meeting.

A sub-committee has been set up to review the problems of contract and outsourced employees of TTD.

AP Govt Special Chief Secretary Sri Manmohan Singh, TTD EO Sri Anil Kumar Singhal, Endowments Commissioner Dr M Padma, TUDA Chairman and Ex-officio member Dr C Bhaskar Reddy, TTD board members, Sri U V Ramanamurthy Raju, Sri Meda Mallikarjuna Reddy, Sri K Parthasarathi, Sri Murali Krishna, Sri N Srinivasan, Sri J Rameswar Rao, Dr M Nichita, Smt V Prasanthi, Sri N Subba Rao, Sri G. Venkatabhaskar Rao, Sri B Parthasarathi Reddy, Sri D Damodara Rao, Sri M S Shivasankaran, Sri Kumara Guru, Sri C. Prasada Kumar, Sri Maremshetty Ramulu, Sri C Pratap Reddy, Sri K Shiv Kumar, special invitees Sri B Karunakar Reddy, Sri Rakesh Reddy, Sri AJ Sekhar, Sri Kupender Reddy, Sri Dushmanta Kumar Das and
Sri Amol Kale were present.

Tirumala special officer Sri A V Dharma Reddy, Tirupati JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల, 23 సెప్టెంబ‌రు 2019: టిటిడి ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమ‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఆరు నెల‌లుగా పెండింగ్‌లో ఉన్న ప‌లు అంశాల‌పై చ‌ర్చించి పాల‌న‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నాం.

– తిరుమ‌ల‌లో తాగునీటి స‌మ‌స్యను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. ఇందుకోసం అంచ‌నాల‌ను రూపొందించి వ‌చ్చే స‌మావేశంలో ఆమోదిస్తాం.

– అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ వ్య‌యాన్ని రూ.36 కోట్ల‌కు త‌గ్గించి ఒక ప్రాకారంతో ఆల‌య నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం.

– తిరుప‌తిలోని అవిలాలకు సంబంధించి తిరుప‌తివాసుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చెరువు, పార్కు మాత్ర‌మే నిర్మించాల‌ని నిర్ణయం.

– తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు ఎల‌క్ట్రిక్ బ‌స్సులు, ఎల‌క్ట్రిక్ కార్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యం.

– టిటిడిలో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌పై స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు స‌బ్ క‌మిటీ ఏర్పాటుకు నిర్ణ‌యం.

– రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించిన అనంత‌రం గ‌రుడ వార‌ధి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై నిర్ణ‌యం.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, తుడ ఛైర్మ‌న్ మ‌రియు ఎక్స్ అఫిషియో స‌భ్యుడు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ యువి.ర‌మ‌ణ‌మూర్తి రాజు, శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శ్రీ కె.పార్థ‌సార‌థి, శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ ఎన్‌.శ్రీ‌నివాస‌న్‌, శ్రీ జె.రామేశ్వ‌ర‌రావు, డా.ఎం.నిచిత‌, శ్రీ ఎన్‌.సుబ్బారావు, శ్రీ జి.వెంక‌ట‌భాస్క‌ర్‌రావు, శ్రీ బి.పార్థ‌సార‌థిరెడ్డి, శ్రీ డి.దామోద‌ర్‌రావు, శ్రీ ఎంఎస్‌.శివ‌శంక‌ర‌న్‌, శ్రీ కుమార‌గురు, శ్రీ సి.ప్ర‌సాద్‌కుమార్‌, శ్రీ మోరంశెట్టి రాములు, శ్రీ పి.ప్ర‌తాప్ రెడ్డి, శ్రీ కె.శివ‌కుమార్, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.