SPECIAL PUJAS IN SKVST _ జనవరి 6న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

Srinivasa Mangapuram, 24 Dec. 19: TTD has  organized special pujas at Sri Kalyana Venkateswara Temple, Srinivasa Mangapuram on VaikuntaEkadasi and Vaikuntha Dwadasi days on January 6 and 7 respectively.

On January  6, the Dhanurmasa rituals, Thomala Seva, Koluvu Panchanga Shravana will be completed from 12.05am to 3am. Devotees will get darshan through Vaikuntha dwaram from 3am on wards till evening 4pm. In the evening and again, after evening rituals darshan will be given between 5pm and 9pm. 

Similarly on January 7, on the day of Vaikunta Dwadasi, the Dhanur masa rituals will be completed between 4am and 5.30am, while the Chakrasnanam will be observed between 9am and 10am.

On New Year Day on January 1, the  Dhanurmasa rituals will commence at 12.05am till 3am  and  darsan for devotees will commence after 3am and last till 4pm and thereafter evening daily rituals will be observed till 9pm.

 

TTD has cancelled arjita sevas including, Swarna Pushparchana on January 1, Arjita Kalyanaotsavam on January 6  and Astottara Sata kalashabishekam on January 7. 

The artists of the HDPP and the Annamacharya Project. Will perform Bhakti sangeet, bhajans and other cultural programs on these auspicious festival days at the Sri Kalyana Venkateswara temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జనవరి 6న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

తిరుపతి, 2019 డిసెంబరు 25: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాల‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 3.00 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  నిర్వహిస్తారు. వేకువజామున 3.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

అదేవిధంగా జ‌న‌వ‌రి 7న  వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4.00 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  నిర్వహిస్తారు. ఉద‌యం 9.00 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.
 
కాగా, ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రాది 2020 జనవరి 1న‌ వేకువజామున 12.05 గంటల నుండి 3.00 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు,  తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 3.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

ఈ సందర్భంగా జనవరి 1న స్వ‌ర్ణ‌పుష్పార్చ‌న,  ఆర్జిత కల్యాణోత్సవం,  జ‌న‌వ‌రి 6న ఆర్జిత కల్యాణోత్సవం, జ‌న‌వ‌రి 7న అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను రద్దు చేశారు.

ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.