SPECIALLY ABLED EMPLOYEES EXCEL IN SPORTS _ టిటిడి క్రీడాపోటీల్లో ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల ప్ర‌తిభ

TIRUPATI, 17 FEBRUARY 2022: The specially-abled employees of TTD who participated in the ongoing annual sports meet of TTD excelled in Chess, Caroms, Dodge Ball that were organized to them on Thursday.

 

The indoor games were held in TTD Parade Grounds of the Administrative building while that of the outdoor in SV Arts College grounds.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి క్రీడాపోటీల్లో ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల ప్ర‌తిభ

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 17: టిటిడి ఉద్యోగుల క్రీడలు గురువారం తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల‌ పరేడ్‌ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఇందులో ప‌లువురు ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన ఉద్యోగులు ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు.

చెస్‌
– బదిర పురుష‌ ఉద్యోగుల పోటీల్లో శ్రీ చంద్రశేఖర్ విజయం సాధించగా, శ్రీ నాగార్జున రన్నరప్‌గా నిలిచారు.

– పాక్షికంగా అంధులైన‌ ఉద్యోగుల పోటీల్లో శ్రీ బాబు విజయం సాధించగా, శ్రీ లక్ష్మీపతి రన్నరప్‌గా నిలిచారు.

క్యారమ్స్

– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన మహిళా ఉద్యోగుల పోటీల్లో శ్రీమతి ప్రియాంక విజయం సాధించగా, శ్రీమతి విజయలక్ష్మి రన్నరప్‌గా నిలిచారు. క్యార‌మ్స్ డ‌బుల్స్‌ పోటీల్లో శ్రీమతి తులసీ, శ్రీమతి మాధవి జ‌ట్టు గెలుపొంద‌గా, శ్రీమతి అమ్ములు , శ్రీమతి గంగోజమ్మ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన పురుష‌ ఉద్యోగుల పోటీల్లో శ్రీ భాస్కర్ విజయం సాధించగా, శ్రీ రెడ్డప్ప రన్నరప్‌గా నిలిచారు. క్యార‌మ్స్ డ‌బుల్స్‌ పోటీల్లో శ్రీ రెడ్డప్ప, శ్రీ విద్యాసాగర్ రెడ్డి జ‌ట్టు గెలుపొంద‌గా, శ్రీ భాస్కర్ , శ్రీ సత్య జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

– 45 ఏళ్ల లోపు పురుష‌ ఉద్యోగుల క్యార‌మ్స్ డ‌బుల్స్‌ పోటీల్లో శ్రీ రమేష్ బాబు, శ్రీ రమేష్ జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ శంకర్ కుమార్, శ్రీ లక్ష్మీ పతి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

డాడ్జి బాల్‌

– 45 ఏళ్ల లోపు మ‌హిళా ఉద్యోగుల పోటీలలో శ్రీమ‌తి లక్ష్మీదేవి జ‌ట్టు విజయం సాధించగా, శ్రీమ‌తి సునంద జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.