SPECTACULAR FETE OF SRI RAMA PATTABHISHEKAM AT SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో వేడుకగా శ్రీరామపట్టాభిషేకం
Tirupati,12 April 2022: As part of the Sri Ramanavami Brahmotsavam celebrations, the celestial fete of Sri Rama Pattabisekam was performed at the Sri Kodandarama Swamy temple on Tuesday night.
Thereafter the TTD also organised the mesmerising Chaturdasa Kalasa Snapana Tirumanjanam ritual at the temple.
At the Pattabisekam after ceremonious Kainkaryams of Pradhana Homan and Purnahuti, special ornaments were adorned to utsava idols of Sita Lakshmana and Anjaneya apart from Sri Rama. After the Pattabisekam the utsava idols were paraded on the temple Mada streets.
Temple Spl Gr DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Chief Archaka Sri Anandakumar Dikshitulu, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Muniratnam, Sri Jayakumar and other devotees were present.
APRIL 14-16 ANNUAL TEPPOTSAVAM
TTD is organising the annual float festival (Teppotsavam) of Sri Kodandarama Swamy temple from April 14-16 at the Sri Ramachandra Pushkarini.
In this connection every day Snapana Tirumanjanam fete if performed to utsava idols in the morning.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో వేడుకగా శ్రీరామపట్టాభిషేకం
తిరుపతి, 2022 ఏప్రిల్ 12: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వేడుకగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తరువాత చతుర్దశకలశ స్నపన తిరుమంజనం చేపట్టారు.
రాత్రి 7 గంటలకు శ్రీరామపట్టాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, యజమాని సంకల్పం, స్వామివారికి వస్త్ర సమర్పణ, లక్ష్మీ ప్రతిమ పూజ, స్వామివారికి కిరిట సమర్పణ చేశారు. తరువాత ప్రధాన హోమం, పూర్ణాహూతి, సీతమ్మవారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయస్వామివారికి రాములవారి నగలను బహూకరించారు. అనంతరం నివేదన, హారతి, చతుర్వేద పారాయణం, మహా మంగళహారతి, యజమానికి వేద ఆశీర్వాదం చేశారు. శ్రీరామపట్టాభిషేకం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, ప్రధానార్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు తెప్పోత్సవాలు
శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుడి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదు చుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.