SPECTACULAR SHOW BY HORSES AND DOGS IN PARADE GROUNDS_ టిటిడి పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న అశ్వ , జాగిలాల ప్రదర్శన

Tirupati, 15 Aug. 19: The NCC students of TTD educational institutions presented a spectacular display of horse show as a part of Independence Day celebrations.

The show included tent pegging and jumping show, display of national, NCC and TTD flags and also horse riding all round the ground by these NCC cadets.

The display by the TTD Dogs squad of the vigilance department was a major attraction during the I-Day celebrations.

The trained dogs presented flower bouquet to TTD EO Sri Anil Kumar Singhal. They also show cased group drills, scanning of drugs and explosives adventure and silent drills, spotting of terrorists, which mused the spectators who thronged to enjoy the celebrations in the ground on Thursday.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో టిటిడి కళాశాలల ఎన్‌సిసి విద్యార్థిని విద్యార్థులు అశ్వాలతో ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రాయల్‌, రాణి ఝాన్సీ, మాపెల్‌, గగన్‌, ట్వింకిల్‌, నట్వర్‌, తులిప్‌ అనే పేర్లు గల అశ్వాలతో ఎన్‌సిసి క్యాడెట్లు పలు విన్యాసాలు చేశారు. మొదటగా జాతీయ జెండా, ఎన్‌సిసి జెండా, టిటిడి జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా, టెంట్‌ పెగ్గింగ్‌, షో జంపింగ్‌ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్‌ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి.

ప్రత్యేక ఆకర్షణగా టిటిడి జాగిలాల ప్రదర్శన

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి శ్రీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్‌, గంగ, శింబా, పృథ్వీ, హంటర్‌, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి గౌరవ వందనం చేయడం, గ్రూప్‌ డ్రిల్‌, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్‌ డ్రిల్‌, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, మంటల మధ్య దూకే సాహసక్రీడ, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.

————————————————————

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.