SPEED UP PARAKAMANI COUNTING MECHANISM-TTD EO_ నాణేల పరకామణి కోసం 2 ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 1 December 2017: The existing mechanism of counting and accounting of the coins and currencies offered by devotees in Srivari Hundi need to be enhanced by purchasing advanced machinery, said TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting on Parakamani activity was held at Annamaiah Bhavan in Tirumala on Friday along with JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar.

Speaking on this occasion, the EO instructed the engineering officials to procure the advanced currency coins counting machinery to speed up the work.

He also instructed the CE Sri Chandra Sekhar Reddy to see that the new Parakamani building which is coming up in Tirupati should be completed on a fast pace.

CVSO Sri A Ravikrishna, SE II Sri Ramachandra Reddy, DyEO Parakamani Sri Rajendrudu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నాణేల పరకామణి కోసం 2 ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 01, తిరుమల 2017: శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న నాణేల పరకామణి కోసం వెంటనే 2 ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం పరకామణి విభాగంపై అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో పరకామణి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. యంత్రాల వినియోగం ద్వారా నాణేలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా లెక్కింపు చేయవచ్చన్నారు. ఆ తరువాత పరకామణి సేవకులు, టిటిడి ఉద్యోగులు నిర్వహిస్తున్న పరకామణి విధులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, పరకామణి డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శిలాతోరణం, చక్రతీర్థంను సందర్శించిన ఈవో, జెఈవో :

తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థాన్ని ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు సందర్శించారు. జియాలజిస్టుల ప్రకారం శిలాతోరణం ఆర్చికి 1500 మిలియన్‌ సంవత్సరాల వయసు ఉందని ఈవో తెలిపారు. దేశంలోనే అతిపురాతన శిలాతోరణంగా దీనికి గుర్తింపు లభించిందని, మరింత మంది భక్తులు సందర్శించేందుకు వీలుగా చర్యలు చేపడతామని అన్నారు. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన చక్రతీర్థం మనోహరంగా ఉందన్నారు. ఇక్కడ సుదర్శన చక్రత్తాళ్వార్‌, శివాలయం వద్ద సుందరీకరణ పనులు చేపడతామన్నారు. అనంతరం శిలాతోరణం పక్కన గల అటవీ వనంలో ఈవో, జెఈఓలు తమ రాశులు, నక్షత్రాల ప్రకారం ఆయా మొక్కలను నాటారు. ఆ తరువాత దశావతార వనాన్ని, శ్రీగంధం మొక్కల పెంపకానికి అనువుగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. చివరగా వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద ఏర్పాటుచేస్తున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్‌ను పరిశీలించారు.

ఈవో వెంట ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, విఎస్‌వో శ్రీరవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.