SPEED UP WORKS IN TTD LOCAL TEMPLES, SAYS JEO_ టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో అభివృద్ధి ప‌నులు వేగ‌వంతంగా పూర్తిచేయాలి – టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

Tirupati, June 6,2019: TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmikantham asked officials to speed up ongoing developmental works in all TTD sub temples on a war footing.

Addressing a review meeting of senior officials at the TTD administrative building on Thursday evening the JEO enquired about ongoing civil, electrical and other works and suggested DyEOs of local temples and engineering officials to coordinate works to facilitate the devotees.

He directed them to install cc camera network in all local temples and also prepare the 12-page calendar, Sri Padmavathi calendar and Srivari big calendar of 2020, diaries of all sizes in attractive designs.

He wanted informative flexes set up on Alipiri-Cherlopalli road, development works on the road besides modernisation works in TTD administrative building including change of its name board.

TTD Chief Engineer Sri Chandrasekhar Reddy, SE-1 Sri Ramesh Reddy, Transport GM Sri Sesha Reddy, Spl Gr.DyEO Smt Smt Varalakshmi, DyEOs Sri Ramamurthy Reddy, Sri Lakshmi Narasamma, Sri Damodaram, mi, Smt Jhansi Rani, DFO Sri Phanikumar Naidu and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో అభివృద్ధి ప‌నులు వేగ‌వంతంగా పూర్తిచేయాలి – టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుప‌తి, 2019 జూన్ 06: టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం స‌మావేశ మందిరంలో గురువారం సాయంత్రం సీనియ‌ర్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈసంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి స్థానిక ఆల‌యాల‌లో చేప‌ట్టిన వివిధ ర‌కాల సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ఇత‌ర అభివృద్ధి ప‌నుల పురోగ‌తిపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జెఈవో ప‌లు సూచ‌న‌లు చేశారు. స్థానిక అల‌యాల డెప్యూటీ ఈవోలు, ఇంజినీరింగ్ అధికారులు స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్పించాల‌న్నారు. అదేవిధంగా టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో సిసి టివిల‌ను స‌కాలంలో ఏర్పాటు చేయాల‌ని విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. 2020వ సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు, చిన్న డైరీలు, పెద్ద డైరీలు, శ్రీవారి పెద్ద క్యాలెండరు, శ్రీ పద్మావతి మరియు శ్రీవారి క్యాలెండర్ల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించాల‌న్నారు.

తిరుప‌తిలోని అలిపిరి – చెర్లోప‌ల్లి రోడ్డు అభివృద్ధి ప‌నులు త్వ‌ర‌త గ‌తిన పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని ప్ర‌ధాన కూడ‌ళ్లు, భ‌క్తుల ర‌ద్దీ ప్రాంతాల‌లో స‌మ‌గ్ర స‌మాచారంతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని కార్యాల‌యాల‌ను ఆధునీక‌రించాల‌ని, అదేవిధంగా టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం నేమ్ బోర్డుకు అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, ర‌వాణావిభాగం జి.యం. శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌రామూర్తి రెడ్డి, శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌, శ్రీ దామోద‌రం, శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు , ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.