SPICES AND DRY FRUITS SANCTIFIED IN THE DIVINE SERVICE _ శ్రీవారి కైంకర్యంలో తరించిన సుగంధద్రవ్యాలు, ఎండుఫలాలు
SAFFRON THREADS, PISTA-BADAM GARLANDS AND CROWNS ENHANCE THE GRANDEUR OF SNANPANAM
DONORS FROM TIRUPPUR AND DECORS FROM HYDERABAD GLORIFY THE RANGANAYAKULA MANDAPAM
TIRUMALA, 03 OCTOBER 2022: After the Japan Apples, Muscat Grapes, Korean Pears, Thai Mangoes, American Cherries, it is now the turn of Saffron threads and Pista-Badam garlands which sanctified their lives in the divine service of Sri Venkateswara during Snapana Tirumanjanam that was held in Ranganayakula Mandapam in Tirumala on Monday.
On the Seventh day afternoon on Monday, the processional deities of Sri Malayappa flanked by Sridevi and Bhudevi were seated on a special platform and were offered the sacred bath with aromatic ingredients. The stage was illuminated and made colourful with Orchids and Lotuses which were hung from the rooftop.
According to Garden Deputy Director Sri Srinivasulu, this year, as a special attraction during Snapana Tirumanjanam, for the first time, garlands and crowns were prepared with the Saffron threads(the styles and stigmas from Crocus sativus-commonly known as saffron flowers). “A kilo of saffron costs nearly Rs.2lakhs and about 3kgs had been used to prepare one garland. The donors were Sri Rajendiran, Sri Shanmuga Sundaram and Sri Bala Subramanyam from Tiruppur of Tamilnadu while the entire preparation and making were done by Ambica Flora of Hyderbad. Around 60 florists worked for days and nights under the supervision of Sri Srinivas, the Chief of Ambica to make these garlands with spices and nuts with finesse.
Among the other garlands and crowns that were decked to the deities during Snapanam included figs and apricots, Pista-Badam-Cardomom, jowar etc. After the completion of each sacred bath, one variety of garland and crown were decorated. Likewise seven types of garlands and crowns were adorned before finally decorated with Tulasi Garlands.
HH Sri Pedda Jeeyar Swamy of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, CVSO Sri Narasimha Kishore, temple DyEO Sri Ramesh Babu and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి కైంకర్యంలో తరించిన సుగంధద్రవ్యాలు, ఎండుఫలాలు
స్నపనంలో ఆకర్షణీయంగా కుంకుమపువ్వు, పిస్తా-బాదం మాలలు, కిరీటాలు
రంగనాయకుల మండపాన్ని అలంకరించిన తిరుపూర్ దాతలు, హైదరాబాద్ అలంకార నిపుణులు
తిరుమల, 2022 అక్టోబరు 03: స్నపన తిరుమంజనంలో శ్రీమలయప్పస్వామివారిని స్పృశించే అవకాశం జపాన్ ఆపిల్స్, మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్, థాయ్ మామిడి, అమెరికన్ చెర్రీస్ తర్వాత ప్రస్తుతం కుంకుమపువ్వు, పిస్తా-బాదం మాలలకు దక్కింది. సోమవారం నాడు ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు.
టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటి డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు అందించిన వివరాల మేరకు. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా మొదటిసారిగా కుంకుమపువ్వు దారాలతో మాలలు, కిరీటాలు సిద్ధం చేశారు. ఒక కిలో కుంకుమపువ్వు ధర దాదాపు రూ.2 లక్షలు కాగా, ఒక మాలను తయారు చేయడానికి దాదాపు 3 కిలోలు ఉపయోగించారు. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన దాతలు శ్రీ రాజేంద్రన్, శ్రీ షణ్ముగ సుందరం, శ్రీ బాల సుబ్రహ్మణ్యం అందించిన విరాళంతో హైదరాబాద్‌కు చెందిన అంబికా ఫ్లోరా సంస్థ ఈ మాలలు తయారు చేసింది. అంబికా సంస్థ అధిపతి శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది నిపుణులు రాత్రింబవళ్లు కష్టపడి సుగంధ ద్రవ్యాలు, ఎండుఫలాలతో ఈ మాలలు తయారు చేశారు.
అదేవిధంగా, అత్తిపండ్లు, నేరేడు పండ్లు, పిస్తా-బాదం-యాలకులు, జొన్నలు మొదలైన వాటితో మాలలు, కిరీటాలు తయారుచేశారు. స్నపనంలో ఏడు రకాల మాలలు, కిరీటాలు, చివరిగా తులసి మాలలు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.