SPIRITUAL ENLIGHTENMENT WITH ANNAMAIAH KRITIS-SCHOLARS _ అన్నమయ్య కీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యం : ఆచార్య కొలకలూరి మధు జ్యోతి

TIRUPATI, 20 MARCH  2023: As a part of the ongoing 520th Death Anniversary fete of the Saint Poet Sri Tallapaka Annamacharya, the scholars unequivocally proclaimed that the Sankeertans penned by him led people to choose the path of spiritual enlightenment.

On the second day of Sahiti Sadas at Annamacharya Kalamandiram in Tirupati, renowned scholars including Smt Madhujyothi, former VC of Sri Potti Sriramulu Telugu University Prof.Bhumaiah, Dr Narsimhacharyulu, recalled the dedication of the saint-poet who has taught even a common man to select the spiritual path through his sankeertans, most of which were written in the local slang for a wider reach.

In the evening vocal concerts by Annamacharya Project veteran artists Sri Madhusudhan Rao, Sri Ranganath will be organised. While at Mahati Auditorium, TTD Asthana Vidhwan Dr Balakrishna Prasad and Smt Kesavi and team Bharat Natyam will be performed. 

Annamacharya Project Director Dr Vibhishana Sharma was also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య కీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యం : ఆచార్య కొలకలూరి మధు జ్యోతి

తిరుపతి, 2023 మార్చి 20: సమాజంలో విలువలు పునరుద్ధరించి, ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకు అన్నమయ్య కీర్తనలు ఎంతగానో దోహదపడతాయని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు కొలకలూరి మధు జ్యోతి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న సాహితీ సదస్సులు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కొలకలూరి మధు జ్యోతి ”అన్నమయ్య – సామాజికత” అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక ప‌రిస్థితుల్లో అన్ని వృత్తుల వారు స‌మాన‌మేన‌ని, రాజు – పేద తేడాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ శ్రీ‌హ‌రే అంత‌రాత్మ అని అన్న‌మ‌య్య తెలియ‌జేశార‌ని చెప్పారు. ఆశ్ర‌మ‌ధ‌ర్మాల్లో గృహ‌స్తాశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని సంకీర్త‌న ద్వారా తెలియ‌జేశార‌న్నారు. పలు సంకీర్తనల్లో రాయలసీమ మాండలికానికి పెద్దపీట వేశారని చెప్పారు. అన్నమయ్య కీర్తన‌లను చదివినా, విన్నా వ్యక్తిత్వ వికాసం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని వివరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డా|| అనుమాండ్ల భూమయ్య ”అన్నమయ్య కీర్తనలలో భావసౌధారం ” అనే అంశంపై మాట్లాడారు. 500 ఏళ్ల క్రితం నాటి అన్నమయ్య సాహిత్యంలో నాటి వైభవాన్ని, సామాజిక జీవనాన్ని అద్భుతంగా వర్ణించారని ఆయన తెలిపారు. ఈయన కీర్తనల్లో భాష, సాహిత్యం, కళలు తదితర అన్ని అంశాల్లో ఉన్నతస్థాయి కనిపిస్తుందన్నారు. భక్తజనానికి వీనులవిందుగా శ్రీ వేంకటేశ్వరుని నామంతో కీర్తనలు రచించి అన్నమయ్య ప్రాచుర్యంలోకి వచ్చారని తెలిపారు.

సప్తగిరి ఉప సంపాదకులు డా|| నొస్సం నరసిం హాచార్యులు ”అన్నమయ్య – నరసింహ కీర్తనలు” అనే అంశంపై ఉపన్యాసించారు . అహోబిలంలో అదివాన్ శఠగోప యతీంద్రులవద్ద వైష్ణవ దీక్షతీసుకుని అక్కడే ఉండి వేదశాస్ర్తాధ్యయనం చేసి నరసింహస్వామికి వేంకటేశ్వరస్వామికి అభేదం చెబుతూ, అన్నమయ్య అనేక కీర్తనలు రాశారన్నారు.
శ్రీ అహోబిలం, కదిరి, చిన్నమండెం నరసింహస్వామిని కీర్తించినట్లు వివరించారు.

రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మధుసూదన్ బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతకుముందు ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రంగనాథ్ బృందం గాత్ర సంగీత నిర్వహించారు.

మహతిలో కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ బృందం గాత్ర సంగీతం, రాత్రి 7.30 నుండి 8.30గంటల వరకు తిరుపతి వాసవి కళానికేతన్ కు చెందిన శ్రీమతి కేశవి బృందం భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా|| విభీష‌ణ శ‌ర్మ‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.