SPIRITUAL FERVOUR MARKS SRIVARI NAVARATRI BRAHMOTSAVAMS _ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం– భక్తులను అలరిస్తున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

DEVOTIONAL MUSIC, VEDIC CHANTING AND HARIKATHA ATTRACT DEVOTEES

Tirumala, October 14, 2026 ;TTD organised devotional and spiritual programmes in Tirumala on Wednesday as part of the Srivari Navaratri Brahmotsavams.

The programmes at Nada Neerajanam and Asthana Mandapam featured Nadaswaram, Vedic messages, Vishnu Sahasranama Parayanam, devotional music, spiritual discourses, Annamacharya Sankirtanas, Nama Sankirtana and Harikatha.

Large numbers of devotees witnessed the programmes and immersed themselves in devotion to Lord Venkateswara.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం– భక్తులను అలరిస్తున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుమల, 2026 అక్టోబరు 14 ; శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో బుధ‌వారం తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీమ‌తి ర‌విప్ర‌భ‌, మరియు శ్రీ నాగేశ్వ‌ర‌రావు బృందం నాదస్వరం, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేద వేద విద్యాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో వేద సందేశం అందించారు. సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు బీజాపూర్‌కు చెందిన శ్రీ‌మ‌తి మాళ‌విక జోషి నామ సంకీర్త‌న‌ నిర్వహించారు.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి శ్రీ‌వాణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ‌మ‌తి సంగూత క‌ఖండ‌కి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీమాన్ వంశీకృష్ణ‌ ధార్మికో ఉపన్యాసం ఇచ్చారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి బుల్లెమ్మ‌ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి మాధ‌వి బృందం హరికథ గానం జరిగింది.

ఈ కార్యక్రమాలను భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి స్వామివారి భక్తిలో మునిగిపోయారు.

 టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.