TTD EO APPRECIATES ARTISTS AT SIMHA VAHANA SEVA _ కళాకారుల ప్రదర్శనలకు టిటిడి ఈవో ప్రశంసలు
Tirupati, October 14, 2026: TTD EO Sri Muddada Ravichandra appreciated artists who performed during the Simha Vahana Seva at Tirumala on Wednesday morning. He presented certificates of appreciation and felicitated them with shawls.
Performances included Mahari, Odissi and Manikarnika dances from Odisha, Dasavatharalu from Andhra Pradesh, Halakki Suggi Kunitha from Karnataka, and drum and Yog Chap performances from Maharashtra, showcasing India’s rich cultural heritage.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
కళాకారుల ప్రదర్శనలకు టిటిడి ఈవో ప్రశంసలు
వివిధ రాష్ట్రాల కళారూపాలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం
తిరుపతి, అక్టోబరు 14, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన సింహ వాహనసేవలో కళారూపాలను ప్రదర్శించిన కళాకారులను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా వివిధ కళాబృందాలు ప్రదర్శించిన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ప్రత్యేకంగా ఆకట్టుకున్న ప్రదర్శనలు:
• ఒడిశా: DSP ఆధ్వర్యంలో మహారి, ఒడిస్సీ, మణికర్ణిక నృత్యాలు – 28 మంది కళాకారులు.
• విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్: ఎస్వీసీఎండీ ఆధ్వర్యంలో శ్రీమతి పి. శైలజారెడ్డి బృందం ప్రదర్శించిన ‘దశావతారాలు’ – 39 మంది కళాకారులు.
• కర్ణాటక: హలక్కి సుగ్గి కునిత జానపద నృత్యం – హరీష్ బృందం, 25 మంది కళాకారులు.
• మహారాష్ట్ర: హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డ్రమ్స్, యోగ్ చాప్ ప్రదర్శనలు – ఎం.జి. కాథేకర్ బృందం, 75 మంది కళాకారులు.
వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల వైభవాన్ని చాటిచెప్పాయి.





