SPIRITUAL LECTURES BY CHAGANTI KOTESWARA RAO _ సీతారాములు జగతికి ఆదర్శప్రాయులు : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Sir Chaganti Koteswara Rao has spectacular command on Spiritual iscourses especially in epics like Srimad Ramayanam, Srimad Bhagavatham and devotional hymns.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సీతారాములు జగతికి ఆదర్శప్రాయులు : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి, 2012 ఆగస్టు 17: త్రేతాయుగంలో నడయాడిన సీతారాములు అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో జగతికి ఆదర్శప్రాయంగా నిలిచారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం కల్యాణ వైభవం పేరిట విశిష్ట ధార్మికోపన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు సీతా కల్యాణం అనే అంశంపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసించారు.
ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ శ్రీమహావిష్ణువు థావతారాల్లో నరుడికి దగ్గరగా ఉన్న అవతారం శ్రీరాముడని అన్నారు. వశిష్టుడు, విశ్వామిత్రుడు గురువుల స్థానంలో శ్రీరాముడిని చక్కని శిల్పంలా తీర్చిదిద్దారని వివరించారు. అనంతరం ఆయన సీతాకళ్యాణంలోని ఘట్టాలను అద్భుతంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం దంపతులు, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ రామచంద్రారెడ్డి తదితర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.