SPLENDID PUSHPAYAGAM HELD _ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

VONTIMITTA, 26 APRIL 2024: The colourful floral bath rendered to the utsava deities of Sri Rama, Sita Lakshmana as a part of Pushpayagam went off in a colourful manner at Vontimitta Sri Kodanda Ramalayam on Friday evening.

Several kilos of varieties of traditional, ornamental flowers and various aromatic leaves were offered to the deities.

Pushpayagam is usually observed after completion of the annual Brahmotsavam as ”Pariharotsavam”, as a ”sin-free” ritual to the commissions and omissions performed either knowingly or unknowingly by the staff, religious staff and even devotees during Brahmotsavams.

DyEO Sri Natesh Babu, Garden Deputy Director Sri Srinivasulu, Superintendent Sri Hanumantaiah, Temple Inspector Sri Naveen, Archaka Swamys, huge number of devotees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 26: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.

సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభ‌వంగా ప్రారంభమైంది. తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, సంపంగి, మొగలి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి రెండు టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.

ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది