SPORTS ENHANCE MENTAL HEALTH-SVBC CHAIRMAN _ క్రీడలతో మానసిక ఉల్లాసం – ఎస్వీబిసి ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర
TIRUPATI, 08 MARCH 2022: SVBC Chairman Dr Saikrishna Yachendra said on Tuesday said that all SVBC employees should serve as members of a family and make the channel more popular.
Participating at the inaugural event of SVBC employees annual sports which is underway at SV University stadium lauded the employees contribution in producing unique programs for devotees in the SVBC channel. Hence sports is a tool to relieve the high stress of their programs etc.
Thereafter he also participated in the international women’s day celebrations held at the SVBC office and highlighted the role of women staffs in the development of the channel.
He said women should scale new heights with financial empowerment for the good of the society.
CEO of the SVBC Sri Suresh Kumar and other channel employees participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
క్రీడలతో మానసిక ఉల్లాసం – ఎస్వీబిసి ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర
తిరుపతి, 2022 మార్చి 08: ఎస్వీబిసి ఉద్యోగులు సమిష్టి కుటుంబంలా పనిచేసి ఛానల్ ఉన్నతికి మరింతగా కృషి చేయాలని ఎస్వీబిసి ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం స్టేడియంలో మంగళవారం ఉదయం ఆయన ఎస్వీబిసి ఉద్యోగుల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్వీబిసి ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను రూపొందించడంలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. నిత్యం పని ఒత్తిడితో అలసిన ఉద్యోగులకు క్రీడా పోటీలు ఆట విడుపు కావాలన్నారు. ఉద్యోగులు అందరూ క్రీడా పోటీల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలన్నారు.
అనంతరం ఎస్వీబిసి కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎస్వీబిసి ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. సమాజ వికాసానికి ఆర్థిక స్వావలంబనకు మహిళలు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ సురేష్ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.