SPOT ADMISSIONS IN TTD JUNIOR COLLEGES ON AUGUST 1, 2 _ ఆగస్టు 1, 2వ తేదీలలో టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

TIRUPATI,  30 JULY 2022: Spot admissions will be conducted in the TTD-run Junior colleges including SV Junior College, SP Junior College for the academic year 2022-23 on August 1 and 2 at 7am in the respective colleges.

The children of regular employees of TTD, SV Balamandir children, outsourcing employees children, those who could not attend the counselling in three phases inspite of getting seats, local students, will get the first priority.

On August 1, students with more than 450 marks and on August 2, students who scored lessthan 450 marks shall attend the spot admission. The students attending for spot admission shall have to verify the vacancy details that will be available in the TTD website on August 1 night.

The students attending spot admissions should make a note that they will not be provided hostel facility. Those students who have already registered through http://admissions‌.tirumala.org in the specified colleges shall have attend the spot admission with necessary certificates and fees

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 1, 2వ తేదీలలో టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

తిరుప‌తి, 2022 జూలై 30: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్ర‌వేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉద‌యం 7 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టీటీడీలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌ ఉద్యోగుల పిల్లలు, బాలమందిర్ పిల్లలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్ల‌లు, సీటు వచ్చి వివిధ కారణాలతో మూడు విడ‌త‌లలో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కానివారు, తిరుప‌తిలోని స్థానిక విద్యార్థి, విద్యార్థునులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆగస్టు 1న‌ 450 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులు, ఆగస్టు 2న 450 మార్కులు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు హాజరు కావచ్చు.

ఆగస్టు 2వ తేదీన హాజరు అగు విద్యార్థులు 1వ తేదీ రాత్రి టీటీడీ వెబ్‌సైట్‌ నందు పొందుపరిచిన ఖాళీల వివరాలు చూసుకుని హాజరు కావలయును.

క‌ళాశాల‌లో మార్కుల ప్రాతిపదికన ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు. హాస్టల్ వసతి స్పాట్ అడ్మిషనుల వారికి కేటాయించరు, కావున ఈ విష‌యాన్ని విద్యార్థులు గమనించగలరు. ఇదివ‌ర‌కే http://admissions‌.tirumala.org ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత క‌ళాశాల‌లో సీట్లు మాత్ర‌మే కావాల్సివారు, ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత జూనియ‌ర్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.