SPOT ADMISSIONS INTO TTD COLLEGES _ మార్చి 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు టిటిడి డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

Tirupati, 10 Mar. 21: After completing online admissions for the academic year 2020-21 into its Colleges, TTD has set for spot admissions. 

The online admissions for SPW Degree, SGS Arts, SV Arts Colleges held in first, second and third phases respectively through the online platform http:/oamdc.ap.gov.in

The spot admissions for SPW Degree College and SGS Arts College will be conducted from 12th March to 20th March while for SV Arts College from 15th March to 20th March at 9:00 a.m. in the respective college premises. 

The students who are willing to join into these colleges shall have to bring relevant certificates and fees receipts along with them. The candidates are requested to note that preference will be given to locals and no hostel facility is available.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు టిటిడి డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

తిరుపతి, 2021 మార్చి 10: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ క‌ళాశాల‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను మిగిలిన సీట్ల కోసం మార్చి 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు విద్యా విభాగం డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హాస్ట‌ల్ సీట్లు క‌ల్పించ‌బ‌డ‌వ‌ని, స్థానికుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని వివ‌రించారు.

ఇదివ‌ర‌కే http://oamdc.ap.gov.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థుల‌కు మొద‌టి, రెండు, మూడో విడ‌తల్లో ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వ‌హించి సీట్లు భ‌ర్తీ చేశారు. మిగిలిన సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ క‌ళాశాల‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌ల్లో ఉద‌యం 9 గంట‌ల నుండి స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, మార్చి 15 నుండి 20వ తేదీ వ‌ర‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాలలో ఉద‌యం 9 గంట‌ల నుండి స్పాట్ అడ్మిష‌న్లు చేప‌డ‌తారు.

క‌ళాశాల సీట్లు మాత్ర‌మే కావాల్సిన విద్యార్థులు సంబంధిత ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత డిగ్రీ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల‌ని కోరడ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.