COVID TESTS FOR DHARMAGIRI STUDENTS

Tirumala, 10 Mar. 21: After Covid lockdown, the Vedic school at Dharmagiri Veda Vignana Peetham at Tirumala reopened for its Vedic students.

All the 435 students underwent Covid tests (RTPCR) five days ago at their home turfs and joined the Vedic school submitting the negative report.

But on March 9, when the Rapid test was conducted again to all students, 57 tested positive and are asymptomatic.

TTD management has shifted them immediately to SVIMS super speciality hospital at Tirupati for better treatment.

Again RTPCR tests have been carried out to all students. None of these students have showcased any Covid symptoms so far and everyone is healthy. The test reports are awaited.

In view of this, TTD has also carried out tests to the remaining 378 pupils and 10 faculty in Dharmagiri Vedapathashala. Everyone tested Negative. TTD is taking all care for its students providing the best Medicare.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌, 2021 మార్చి 10: కోవిడ్‌-19 నేప‌థ్యంలో లాక్‌డౌన్ అనంత‌రం 5 రోజుల ముందు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మొత్తం 435 మంది విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు. వీరంద‌రూ త‌మ స్వ‌స్థ‌లాల్లో కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌లు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు స‌మ‌ర్పించారు. అయితే, మార్చి 9న విద్యార్థులంద‌రికీ మ‌రొక‌మారు క‌రోనా ర్యాపిడ్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా, ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా 57 మంది విద్యార్థుల‌కు పాటిజివ్ రిపోర్టు వ‌చ్చింది. అధికారులు వెంట‌నే స్పందించి మెరుగైన వైద్య చికిత్స‌ల కోసం తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డ‌మైన‌ది. మ‌ళ్లీ వారికి ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష చేయించ‌డం జ‌రిగింది. ఫ‌లితాలు రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం వారికి ఎలాంటి వ్యాధి లక్ష‌ణాలు లేవు. వారు ప‌రిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వ‌ర‌లోనే వారిని డిశ్చార్జి చేస్తారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టిటిడి అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది.
 
ఈ నేప‌థ్యంలో మిగిలిన 378 మంది విద్యార్థుల‌కు, 35 మంది అధ్యాప‌కుల‌కు, 10 మంది ఇత‌ర సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అంద‌రికీ నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.