SPREAD THE GLORY OF SRIVARU TO THE WORLD- TTD CHAIRMAN _ శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వ్యాప్తి చేయండి- మీడియా ప్ర‌తినిధుల‌తో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌రరెడ్డి

Tirumala, 18 September 2023: TTD Chairman Sri. Bhumana Karunakara Reddy asked the media representatives to spread the glory of Srivaru and His mighty Vahana Sevas to the global devotees during the ongoing Srivari Salakatla Brahmotsavams and upcoming Navratri Brahmotsavams. 

On Monday morning, the Chairman along with TTD EO inaugurated the Media Centre established at Rambhagicha-2 Rest House in Tirumala.

Speaking on this occasion, the chairman said that there is a possibility of a large number of devotees coming this year for Adhika Masa Brahmotsavams which is happening first-time post-COVID. He said extensive arrangements are being made under the auspices of all departments. 

He explained that all steps will be taken to provide satisfactory darshan of the presiding deity as well along with vahana sevas during Brahmotsavams. 

The Trust Board Chief said that TTD set an example for other temples in the propagation of Hindu Sanatana Dharma and the role of officials in upholding the reputation of the institution is remarkable from the last five to six decades.

He said that during his childhood, the average pilgrim rush a day used to be 6,000 to 7,000 devotees which rose to a lakh at present.   

TTD EO Sri AV Dharma Reddy, PRO Sri Ravi and other staff participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023

శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వ్యాప్తి చేయండి

– మీడియా ప్ర‌తినిధుల‌తో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌రరెడ్డి

– రాంభ‌గీచా-2లో మీడియా సెంట‌ర్ ప్రారంభం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 18: శ్రీవారి సాల‌క‌ట్ల‌, న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవ య‌జ్ఞంలో మీడియా ప్ర‌తినిధులుగా స‌మిధ‌లుగా మారి వాహ‌న‌సేవ‌ల వైభ‌వాన్ని భ‌క్తుల‌కు వ్యాప్తి చేయాల‌ని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌రరెడ్డి మీడియా ప్ర‌తినిధుల‌ను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సోమ‌వారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ కోవిడ్ త‌రువాత ఈ ఏడాది అధిక సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని భావిస్తున్నామ‌ని, ఇందుకోసం అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి సంతృప్తిక‌రంగా మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ధ‌ర్మ‌ప్ర‌చారంలో ఇత‌ర ఆల‌యాల‌కు టీటీడీ ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని, ఆల‌య ప్రాశ‌స్త్యాన్ని పెంచ‌డంలో టీటీడీ అధికారుల పాత్ర ఎన‌లేనిద‌ని చెప్పారు. నా చిన్న‌త‌నంలో రోజుకు 6 వేల నుండి 7 వేల మంది భ‌క్తులు ద‌ర్శించుకునేవార‌ని, ప్ర‌స్తుతం రోజుకు ల‌క్ష మంది ద‌ర్శించుకుంటున్నార‌ని తెలిపారు. విశేషంగా విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి నేతృత్వంలో అధికారులు ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేప‌డుతున్నార‌ని వివ‌రించారు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేసే విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా భ‌క్తుల సేవ‌తో ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

మీడియా సెంటర్‌లో మీడియా ప్ర‌తినిధుల‌కు భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ వసతిని టీటీడీ కల్పించింది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ పిఆర్వో డా|| టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఒఎస్డీ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.