SRAVANAM- GODS GIFT TO HEARING IMPAIRED CHILDREN- TTD JEO _ వినికిడి లోపం చిన్నారులకు ‘శ్రవణం’ ఓ వరం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 7 Feb. 20: Sravanam project is a boon of Srivaru to the hearing impaired children as the projects aims at their education and transforms them to lead a normal life in the society besides curing their ailment, said JEO Sri P Basant Kumar.

Participating as chief guest in the 14th anniversary celebrations of the Sravanam project the JEO said that the unique project was special among all other projects of TTD and had earned a niche in hearts of devotees.

Started in 2006, the project had taken a good form since 2008 and bloomed to treat 347 impaired children into normal students who are now in general schools and he has applauded the selfless efforts of teachers of Sravanam for the credit.

The celebrations began with special pujas by archakas but the hallmark was the presentation of cultural programs including songs and poems by students which attracted the JEO and other officers and parents to a great extent.

TTD  DEO Dr Ramana Prasad presented the annual report. The JEO also presented prizes to meritorious students and Balaji who shined in sports also. 

Rs 9 LAKH DONATION FOR BT HEARING AIDS

The proprietors of Ludhiana based Mark Hearing Center, Sri Sanjiv Grover, Sri Shiva Grover, Dr Vani, Dr Vibhu and Sri Kamalesh have presented 55 pairs of BT hearing machines worth ₹9 lakh to the impaired students of the Sravanam.

AEO Smt Tamaraselvi, Superintendent Smt Varalu, Sravanam teachers, staff and parents of children participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వినికిడి లోపం చిన్నారులకు ‘శ్రవణం’ ఓ వరం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2020  ఫిబ్ర‌వ‌రి 07: మాటలు రాని చిన్నారులకు మాటలతోపాటు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తులో వారు సాధారణ పిల్లల్లాగా కొనసాగేందుకు కృషి చేస్తున్న‌శ్రవణం ప్రాజెక్ట్ పిల్ల‌ల‌కు ఓ వ‌రం అని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ తెలిపారు. తిరుపతిలోని శ్రవణం ప్రాజెక్ట్ 14వ వార్షికోత్సవం శుక్రవారం ఉద‌యం పాత మెటర్నిటి ఆసుపత్రి ఆవరణలోని శ్రవణం కేంద్రంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తులు ఇచ్చిన విరాళాల‌తో టిటిడి నిర్వ‌హిస్తున్న అనేక సేవా కార్య‌క్ర‌మాల‌లో ముఖ్య‌మైన‌ది శ్ర‌వ‌ణం, బ‌ర్డ్‌, స్విమ్స్ ముఖ్య మైన‌వ‌న్నారు. పుట్టుకతో వినికిడిలోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి తగిన వినికిడి యంత్రాలు అమర్చి, శిక్షణ ఇచ్చి వారిని సాదారణ స్థితికి తీసుకువచ్చేందుకు శ్రవణం సంస్థ కృషి చేస్తోందన్నారు. అన్నిదానాల‌లోకి విద్యా దానం గొప్ప‌ద‌ని, పిల్ల‌ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డంలో అధ్యాప‌కుల సేవ‌ల వ‌ల‌న శ్ర‌వ‌ణం సుస్థిర‌స్థానం సంపాదించుకుంద‌న్నారు.  

డిసెంబర్‌ 15, 2006లో స్థాపించబడిన ఈ సంస్థ 2008 ఏడాది నుండి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 347 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ పాఠశాలలో చేర్పించారని అన్నారు. శ్రవణం సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని జెఈవో అభినందించారు.

ముందుగా అర్చకులు ప్రార్థన చేశారు. వార్షిక నివేదికను డిఈవో డా.ర‌మ‌ణ ప్ర‌సాద్‌ నివేదించారు. చిన్నారులు నేర్చుకున్న పద్యాలు, పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రవణం సంస్థ ఇచ్చిన శిక్షణ మూలంగా తమ పిల్లలు వినికిడి లోపం నుండి సాధారణ స్థితికి వచ్చారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభ కనపరచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంత‌రం క్రీడ‌ల‌లో విశేష ప్ర‌తిభ‌ క‌న‌ప‌రిచిన బాలాజిని జెఈవో స‌న్మానించారు.

చిన్నారుల‌కు రూ.9 ల‌క్ష‌ల విలువైన  బిటి హియరింగ్‌ యంత్రాలు విరాళం –

లూధియానాకు చెందిన మార్క్ హియ‌రింగ్ సెంట‌ర్ యాజ‌మాన్యం శ్రీ సంజివి గ్రోవ‌ర్‌, శ్రీ షికా గ్రోవ‌ర్‌, డా.వాణి, డా.విభు, శ్రీ క‌మ‌లేష్‌లు రూ.9 ల‌క్ష‌ల విలువైన 55 జ‌త‌ల బిటి హియరింగ్‌ యంత్రాలను చిన్నారుల‌కు విరాళంగా అందించారు.  

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీమతి సెల్వి, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి వ‌రాలు, శ్రవణం ఉపాధ్యాయులు, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.