NALAYIRA DIVYA PRABANDHA MAHOTSAVAM IN TIRUMALA ON FEB 9 _ ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం

Tirumala, 7 Feb. 20: The prestigious Nalayira Divya Prabandha Mahotsavam will be observed at Asthana Mandapam in Tirumala on February 9 in a big way by Hindu Dharma Prachara Parishad (HDPP) and Alwar Divya Prabandha Projects of TTD.

A meeting with Tirumala Jeeyar Swamijis and Dharmacharyas will be organized between 10am and 12 noon followed by Divya Prabandha Parayanam on the same day at 4pm. 

While in the evening, the pundits will recite Divya Prabandha Gosthi Ganam in front of Garuda Vahanam during Pournami Garuda Seva.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం

ఫిబ్రవరి 07, తిరుమల 2020:  శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ ఆదివారం పౌర్ణమి గరుడసేవలో వైభవంగా జరుగనుంది. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు.

ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ త‌రువాత రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయ‌ర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.