SRI ANDAL NEERATOTSAVAM GRAND FINALE AT SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

Tirupati, 13 January 2018: The seven day event of Andal Neeratotsavam came to a grand finale at the Sri Govindaraja Swamy Temple on Saturday.

As part of the utsav the utsava idol of Sri Andal Ammavaru was taken out in a procession at Sri Govindaraja Swamy Temple in the morning, along Mada streets, Chinna Bazar street, Sri Kodanda Rama Temple Mada street and on the Sri Ramachandra Pushkarini to the Neerada Mandapam where Ekanta Abhisekam was performed and devotes wil be allowed darshan in the evening.

The Utsava deity will be brought back to Sri GT in the evening after pradakshina of Sri Kodanda Rama Swamy Temple.

Among others TTD local temples DyEO Smt Varalakshmi, Temple Superintendent Sri Jnanaprakash, Temple Insepctor Sri Krishnamurthy and others officials and devotees participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుపతి, 2018 జనవరి 13: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన శ్రీఆండాళ్‌ మార్గాళి నీరాటోత్సవాలు శనివారం ముగిశాయి.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. ఆస్థానం చేపట్టారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.