SRI BHU SAMETHA KALYANA VENKATESWARA SWAMY GETS SNAPANA TIRUMANJANAM _ వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం

Tirupati, 03 March 2024: As part of the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy, the Swamy and the Ammavarlu were bathed in a traditional way on Sunday in the Kalyana Mandapam at Srinivasa Mangapuram.

This special ritual was organized under the leadership of Sri Seshacharya, Kankanabhattar. Vishvaksena Aradhana, Punyahavachanam, Navakalasabhishekam and Rajopacharam were performed. After that Naivedyam, Arghyapada Nivedana were offered.

On this occasion, the priests recited Taittariya Upanishad, Purusha Sukta, Srisukta, Bhusukta, Neelasukta, Panchashanti mantras and Pashuras were recited.

During snapanam with an ingredient, each time one Garland is offered. Similarly, seven types of garlands including rose, lotus, rose petals, colorful orchid flowers, kuskus and tulsi were decorated for Swami and Ammavarlu on the occasion.

Special Grade Deputy EO of the temple Smt. Varalakshmi, AEO Sri. Gopinath, Superintendents Sri. Venkataswamy, Sri Chengalrayalu, Temple Inspector Sri. Kiran Kumar Reddy, devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం

తిరుపతి, 2024 మార్చి 03: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు ఆదివారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్‌
శ్రీ శేషాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున రోజా, తామ‌ర‌, రోజ్ పెట‌ల్స్‌, రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, వ‌ట్టి వేరు, తుల‌సి వంటి ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌ట‌స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.