శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్ర సమర్పణ
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్ర సమర్పణ
సెప్టెంబరు 21, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. శనివారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.
ఈ కార్య్రకమంలో స్థానిక ఆలయాల డెప్యూటి ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.పి. శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.