AUGUST FESTIVALS OF SRI GT_ ఆగస్టులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 30 July 2019: Following are special events at Sri Govindaraja Swamy temple in the month of August 2019,
August 1: Sri Chakrathalwar Shattumora, Sri Prativadi Bhayankar Annan Shattumora.
August 3, Sri Andal Tiruvadipuram Sattumora
August 4, Uttara nakshatram procession of Sri Govindaraja Swamy and consorts
August 7: Adi Swati procession of Sri Govindaraja Swamy
August 9, Varalakshmi vratam procession of Andal ammavaru
August 12: Tulasi Mahatya utsava and Garuda vahanam Of Sri Govindaraja Swamy
August 14: Sravana nakshatram procession of Sri Kalyana Venkateswara.
August 15: Sravana Pournami procession of Srivari and Sri Krishna to Kapilathirtha Temple.
August 15,31: Friday procession of Andal Ammavaru
August 23: Gokulashtami Asthanam
August 24: Rohini nakshatram procession of Sri Parthasarathy and consorts
August 26: Chinna Veedi Utlotsavam
August 27: Peddaveedi Utlotsavam
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
జూలై 30, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
– ఆగస్టు 1న శ్రీ చక్రత్తాళ్వార్ శాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ శాత్తుమొర.
– ఆగస్టు 3న శ్రీ ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరిగి వచ్చే క్రమంలో చిన్నజీయర్‌స్వామి మఠానికి చేరుకుని ఆస్థానం చేపడతారు.
– ఆగస్టు 4న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
– ఆగస్టు 7న ఆడి స్వాతి రోజున సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
– ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– ఆగస్టు 12న తులసి మహత్యం ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు.
– ఆగస్టు 14న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
– ఆగస్టు 15న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీవారు, శ్రీ కృష్ణస్వామివారు కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు.
– ఆగస్టు 16, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– ఆగస్టు 23న గోకులాష్టమి ఆస్థానం.
– ఆగస్టు 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
– ఆగస్టు 26న చిన్నవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
– ఆగస్టు 27న పెద్దవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.