PAVITROTSAVAMS COMMENCE IN SRI GT_ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati, 1 September 2017: The thred-day annual pavitrotsavams in the famos temple of Sri Govindaraja Swamy commenced in Tirupati on Friday.

On first day Pavitra Pratistha has been performed in a colourful manner amidst religious fervour.

The specially woven silk thread garlands were decorated to the processional deities in Yagashala after Snapana Tirumanjanam.

In the evening there was a celestial procession of deities along the mada streets.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2017 సెప్టెంబరు 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు (ఇద్దరికి) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మీ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తి రాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI