ఆగస్టులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

ఆగస్టులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 జూలై 31: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

– ఆగస్టు 3, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

– ఆగస్టు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం కారణంగా సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

– ఆగస్టు 10న శ్రీ చక్రత్తాళ్వార్‌ శాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్‌ శాత్తుమొర.

– ఆగస్టు 13న శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరిగి వచ్చే క్రమంలో చిన్నజీయర్‌స్వామి మఠానికి చేరుకుని ఆస్థానం చేపడతారు.

– ఆగస్టు 14న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.

– ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతం.

– ఆగస్టు 25న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.