SRI GT FESTIVALS _ శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

TIRUPATI, 08 JANUARY 2023: The Sankranti festivities will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati.

 

The festival includes Bhogi Teru on January 14, Makara Sankranti on January 15, Goda Parinayam on January 16.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

– జనవరి 16న గోదా ప‌రిణ‌యోత్స‌వం

తిరుపతి, 08 జనవరి 2023:  సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జనవరి 14న భోగితేరు, జ‌న‌వ‌రి 15న మకరసంక్రాంతి జరుగనున్నాయి.

జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.

జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. బాలాలయం జరుగుతున్న కారణంగా జనవరి 16న కనుమ రోజు నిర్వహించే పార్వేట ఉత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

జనవరి 16న గోదా ప‌రిణ‌యోత్స‌వం

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 16న గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉద‌యం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం వేడుకగా నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.