SRI GT FLOAT FESTIVAL ENDS _ ఘనంగా ముగిసిన శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 26 Feb. 21: The Utsava idol of Sri Govindarajaswami and His consorts took a celestial ride on the richly decorated float in the Sri Govindarajaswami Pushkarini on Friday evening, the seventh and last day of the ongoing annual float festival.

The TTD EO Dr KS Jawahar Reddy also participated in the final day festivities of the celestial float festival.

The artists of HDPP presented bhajans and Harikatha sangeet programs during the float festival.

Temple special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, superintendents, Sri Venkatadri, Sri Rajkumar and temple inspectors Sri Kamraju, Sri Munindrababu and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, 2021 ఫిబ్రవరి 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు శుక్ర‌‌వారంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వ‌ర‌కు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, ‌‌శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ మునీంద్ర‌బాబు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.