SRI GT JYESTABHISHEKAM CONCLUDES_ కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం

Tirupati, 6 July 2017: The annual three day Jyestabhishekam concluded on a ceremonial note in Sri Govinda Raja Swamy temple in Tirupati on Thursday.

After awakening the deities with Suprabhata Seva, Sri Devi and Bhudevi Sametha Srivaru was brought to Kalyana Mandapam and Satakalasa Snapanam was performed with religious fervour. Kavacha Samarpana was performed after the rituals. Later in the evening procession was held along the mada streets.Temple DyEO Smt Varalakhsmi, AEO Sri Prasada Murthy Raju and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం

తిరుపతి, 2017 జూలై 06: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామ తం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం మహాశాంతిహోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తి రాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.