GRANDHI PAVITRA SAMARPANA TO KAPILESWARA_ ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

Tirupati, 6 July 2017: As a part of the ongoing three day Pavitrotsavams in Sri Kapileswara Swamy temple, Grandhi Pavitra Samarpana activity was performed in a religious way on Thursday.

Earlier during the day after Suprabhatam, Abhishekam was performed to the main deity of Kapileswara Swamy. Later in the evening, Pavitra Samarpana was conducted in the Yagashala.

Temple DyEO Sri Subramanyam and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

తిరుపతి, 2017 జూలై 06: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది. ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు.

ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్తులు ఒక రోజు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథన్‌ స్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉదయస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ ఓబుల్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీమురళీక ష్ణ ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.