SRI GT PAVITROTSAVAMS FROM AUGUST 28-30 _ ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
Tirupati, 24 Aug 20: The Annual Three-days Pavitrotsavams in Sri Govindaraja Swamy Temple in Tirupati will be held from August 28 to 30 with Ankurarpanam on August 27.
On first day of Pavitrotsavam on August 28, Pavitra Pratista will be performed, on the second day, Pavitra Malas will be decked to Mulavirat, utsava deities, Vimanam, Dhwajasthambham, Sri Matham Anjaneya located in four mada streets while on August 30 Pavitra Purnahuti will be performed.
While on these three days, there will be snapana tirumanjanam to the utsava deities. In view of Covid restrictions, this festival will be performed in Ekantham.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి, 2020 ఆగస్టు 24 ;తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఆగస్టు 27న సాయంత్రంరుత్విక్‌వరణం,మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 28న ఉదయం పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 30న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.