ALL SET FOR PUSHPAYAGAM IN SRI GT_ జూన్‌ 30న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

Tirupati, 28 June 2017: The annual pushpayagam will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati on June 30 with Ankurarpanam on June 29.

This celestial fete where the deities will be given floral bath will be performed between 1pm to 4pm.

Temple authorities are supervising the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 30న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి, 2017 జూన్‌ 28: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్‌ 30వ తేదీన పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం జూన్‌ 29వ తేదీ గురువారం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

జూన్‌ 30వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.

మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.