SRI GT PUSHPA YAGAM ON JUNE 30 / జూన్‌ 30న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

Tirupati, 17 June 2017: The annual Pushpayagam in the temple of Sri Govinda Raja Swamy will be observed on June 30 with Ankurarpanam on June 29.

In connection with the Pushpayagam Snapana tirumanjanam will be performed to the deities between 9.30 am to 11 am and the floral tribute will take place in temple between 1 pm to 4 pm. Later the deities will be taken on a celestial procession in the four mada streets in the evening between 6:30pm to 7:30pm.

The Grihasta pilgrims can pay Rs.516 and take part in this colourful festival which is considered to be one of the important festivals of the temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్‌ 29వ తేదీన పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం జూన్‌ 29వ తేదీన

సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

జూన్‌ 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి

సమేత శ్రీగోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.

మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ,

నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి

ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం

ఇవ్వనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.