SRI GT TEPPOTSAVAM POSTERS RELEASED_ జనవరి 25 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు గోడపత్రికలను ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati 18 January 2018: The annual Teppotsavams posters of Sri Govinda Raja Swamy temple were released by Tirupati JEO Sri P Bhaskar on Thursday. Temple DyEO Smt Varalakshmi was also present.

Releasing the posters in his chambers in Tirupati, the JEO said, the annual seven-day float festival will be observed between January 25-31 in Sri Govindaraja Swamy Pushkarini located in Tirupati.

Every the celestial float event takes place between 6pm and 8pm. On first day, the Lord takes ride as Kodanda Rama Swamy while on second day as Sri Parthasaradhi Swamy, on third day as Sri Kalyana Venkateswara Swamy, fourth day as Sri Krishna Swamy along with Andal and in last three days as Sri Govinda Raja Swamy with Sri Devi and Bhu Devi.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 25 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు గోడపత్రికలను ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 జనవరి 18: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 25 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న తెప్పోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారన్నారు. జనవరి 25న శ్రీ కోదండరామస్వామివారు, జనవరి 26న శ్రీ పార్థసారథిస్వామివారు, జనవరి 27న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, జనవరి 28న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, జనవరి 29, 30, 31వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై భక్తులకు కనువిందు చేస్తారని వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఆర్‌.వరలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.